తంగలాన్ సక్సెస్ పా రంజిత్ ఖుష్
దర్శకుడికి అభినందనల వెల్లువ
హైదరాబాద్ – సామాజిక నేపథ్యం కలిగిన దర్శకులలో ఒకరు తమిళనాడు సినీ రంగానికి చెందిన పా రంజిత్. తను అభ్యుదయ భావాలు కలిగిన రచయిత, మేధావి, ఫిల్మ్ మేకర్. సామాజిక అంతరాలు ఉండ కూడదని , ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుందని , జీవించే హక్కును హరించే హక్కు ఎవరికీ లేదని గత కొంత కాలంగా తను గొంతు విప్పుతూ వచ్చాడు.
తాజాగా విక్రమ్, మాళవికా మోహన్ తో కలిసి భారీ ఎత్తున తంగలాన్ సినిమా తీశాడు. దీనిపై కొందరు మనువాదులు మండి పడినా చివరకు విడుదలైన అన్ని చోట్లా దేశ , ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఆదరణ చూరగొంటోంది.
ఫిల్మ్ మేకర్స్, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు , అన్ని రంగాలకు చెందిన వారు దర్శకుడు పా రంజిత్ ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నారు.
మట్టికి సంబంధించిన కథలు సినిమాలుగా వచ్చినప్పుడే ప్రపంచ థియేటర్లలో మన నేల గర్వం, జీవితం నమోదవుతుంది. అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన కళాకారులు ప్రపంచాన్ని పర్యటించేలా చేస్తాయి.
ఇలా భూమిని కోల్పోయిన సంఘటనలను బేరీజు వేసుకున్న సినిమా తంగలాన్. ఉత్తమ రచనలు ప్రజలలో కనిపిస్తాయి.
జన జీవనాన్ని ఎంతో బాధతో చెబుతున్న దర్శకుడు రంజిత్‌కు అభినందనలు. మంచి సినిమాల కోసం ఎప్పుడూ తనను తాను ఇబ్బంది పెట్టేవాడు విక్రమ్ హీరో. తంగలాన్ ఆస్కార్ కూడా వరిస్తుందనడంలో సందేహం లేదు. మెగా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి ఇది గ్లోబల్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పక తప్పదు.