టార్జాన్ నటుడు రాన్ ఎలీ ఇక లేరు
సోషల్ మీడియాలో కూతురు వెల్లడి
అమెరికా – ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ నటుడిగా గుర్తింపు పొందిన టార్జాన్ నటుడు రాన్ ఎలీ ఇక లేరు. ఆయన కన్ను మూశారని కూతురు కిర్ స్టన్ గురువారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఆయనకు 86 ఏళ్లు. టార్జాన్ చిత్రంతో అత్యంత జనాదరణ పొందారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా రాన్ ఎలీని అక్కున చేర్చుకున్నారు.
రాన్ ఎలీ పేరుతో 1960లో టీవీ సీరిస్ లలో టార్జాన్ పాత్ర పోషించారు. తన దివంగత తండ్రితో తాను పంచుకున్న అపురూపమైన క్షణాలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు . అమెరికా సినీ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు రాన్ ఎలీ.
ఇన్ స్టా లో కిర్ స్టన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం తనకు తెలిసిన గొప్ప వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది -అందులో నేను నా తండ్రిని కోల్పోయాను అంటూ వాపోయింది.
మా నాన్నని ప్రజలు హీరో అని పిలుచుకునే వ్యక్తి. అతను నటుడు, రచయిత, కోచ్, గురువు, కుటుంబ వ్యక్తి, నాయకుడు. అతను ఎక్కడికి వెళ్లినా సానుకూలతో కూడిన శక్తివంతమైన తరంగాన్ని సృష్టించాడు. ఇతరులపై అతను చూపిన ప్రభావం ఏదో ఒకటి. నేను మరే వ్యక్తిలోనూ చూడ లేదని స్పష్టం చేసింది కూతురు.
నా తండ్రే నాకు స్పూర్తి. ఆయనే నా ప్రపంచం. ఎంతో అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడని తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే గొప్ప వ్యక్తిని కోల్పోయానని వాపోయింది.