BUSINESSTECHNOLOGY

సీఎంతో టాటా చంద్ర‌శేఖ‌ర‌న్ భేటీ

Share it with your family & friends

కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు

అమ‌రావ‌తి – ప్ర‌ముఖ దిగ్గ‌జ కంపెనీ టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌రన్ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఇటీవ‌లే దివికేగిన ర‌త‌న్ టాటా ను గుర్తు చేసుకున్నారు. ఈ దేశం మ‌రిచి పోలేని గొప్ప వ్య‌క్తి అని పేర్కొన్నారు చంద్ర‌బాబు నాయుడు.

ఆయ‌న‌ దార్శనిక నాయకత్వం , సహకారం భారతదేశ పరిశ్రమ ల్యాండ్ స్కేప్‌లో చెరగని ముద్ర వేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ర‌త‌న్ టాటా ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టాటా గ్రూప్ ముఖ్యమైన వాటాదారుగా కొనసాగుతోందన్నారు. ఏపీలో వృద్ధికి సంబంధించిన కొన్ని కీలక రంగాలను కూడా చర్చించడం జ‌రిగంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు,

ఏపీ, టాటా గ్రూప్ ల మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌పడుతుంద‌న్నారు సీఎం. ఇదిలా ఉండ‌గా టాటా గ్రూప్ కొత్త‌గా విశాఖ‌ప‌ట్నంలో టీసీఎస్ ను ఏర్పాటు చేయ‌నుంద‌ని ప్ర‌క‌టించారు. దీని ద్వారా 10,000 ఉద్యోగాలకు ఛాన్స్ ఉంద‌న్నారు చంద్ర‌శేఖ‌ర‌న్.

కొత్త‌గా ఐటీ డెవ‌ల‌ప్ సెంట‌ర్ ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. పర్యాటకం, పారిశ్రామిక వృద్ధిని పెంచడానికి, ఇండియన్ హోటల్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 హోటళ్లను (తాజ్, వివాంటా, గేట్‌వే, సెలెక్యూషన్స్ , జింజర్ హోటల్స్) ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి అన్వేషిస్తోంది టాటా గ్రూప్.