మార్చి 22 నుంచి నెల రోజుల పాటు ఐపీఎల్ 2025
ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డ్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనింగ్ మ్యాచ్ ఆడనున్నాయి. గత ఏడాది ఎవరూ ఊహించని రీతిలో కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈసారి ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ తో తలపడనుంది. ఆర్సీబీ జట్టు బలంగా ఉంది. విరాట్ కోహ్లీ కీలకంగా మారనున్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్ము రేపాడు. ఈ రెండు జట్లు మొదటిసారి 2008లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రారంభ ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఒకదానికొకటి తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలుపొందింది. ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది.
ఇక జట్ల విషయానికి వస్తే కేకేఆర్, ఆర్సీబీ జట్లు ఇప్పటి వరకు 17 ఐపీఎల్ సీజన్లలో 34 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ దే పైచేయిగా ఉంది. వీటిలో 20 మ్యాచ్ లలో కోల్ కతా గెలిస్తే 14 మ్యాచ్ లలో మాత్రమే బెంగళూరు గెలుపొందింది. కోల్ కతా తన స్వంత మైదానంలో బలంగా ఉంది. ఇప్పటి వరకు ఈడెన్ గార్డెన్స్ లో మొత్తం 88 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఏకంగా 52 మ్యాచ్ లు గెలుపొందింది కోల్ కతా నైట్ రైడర్స్. కోల్ కతా జట్టుకు యజమానిగా ఉన్నారు షారుక్ ఖాన్. గత ఏడాదిలో జరిగిన ఐపీఎల్ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడితే 5 మ్యాచ్ లను విజయం సాధించడం విశేషం.