SPORTS

ఆ ధ‌ర‌కు నేను అర్హుడిని – చాహ‌ల్

Share it with your family & friends

షాకింగ్ కామెంట్స్ చేసిన స్పిన్న‌ర్

ముంబై – ప్ర‌ముఖ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. జెడ్డా వేదిక‌గా జ‌రిగిన టాటా ఐపీఎల్ మెగా వేలం పాట‌లో ఊహించ‌ని ధ‌ర‌కు అమ్ముడు పోయాడు. త‌ను గ‌త ఐపీఎల్ టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడాడు. ఈసారి ఊహించ‌ని విధంగా త‌న‌ను రిటైన్ తీసుకోలేదు ఆర్ఆర్ మేనేజ్ మెంట్. దీనిపై తీవ్ర ఆందోళ‌న చెందాడు. త‌న‌కు సంజూ శాంస‌న్ తో , మాజీ హెడ్ కోచ్ కుమార సంగ‌క్క‌ర‌తో బంధం ఉండేది.

కానీ త‌న‌కు మంచే జ‌రిగింద‌ని తెలిపాడు. ఈసారి వేలం పాట‌లో అత్య‌ధిక ధ‌ర‌కు ఈ స్పిన్న‌ర్ అమ్ముడు పోవ‌డం విస్తు పోయేలా చేసింది. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఓన‌ర్ ప్రీతి జింటా భారీ ధ‌రకు త‌న‌ను కొనుగోలు చేసింది. రూ. 18 కోట్లకు చేజిక్కించుకుంది.

ఐపీఎల్ వేలం పాట‌కు సంబంధించి హాట్ టాపిక్ గా మారాడు ఈ స్పిన్న‌ర్. ఆ ధ‌ర‌కు తాను అర్హుడినేనంటూ స్ప‌ష్టం చేశాడు. యుజ్వేంద్ర చాహ‌ల్ ను తీసుకునేందుకు రెండు ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి పంజాబ్ తో పాటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ .

ఐపీఎల్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా రికార్డ్ త‌న‌పై ఉంది. 80 టి20ల‌లో 25.09 స‌గ‌టుతో 96 వికెట్లు తీశాడు. ఓవ‌ర్ ఆల్ గా 305 మ్యాచ్ ల‌లో 354 వికెట్లు కూల్చాడు.