ఏపీలో టీడీపీ కూటమికే ఛాన్స్
జనమత్ పోల్స్ సర్వేలో వెల్లడి
అమరావతి – ఏపీలో సీన్ మారనుందా. జాతీయ మీడియా సంస్థలన్నీ గంప గుత్తగా టీడీపీ , జనసేన, బీజేపీ కూటమికి ఈసారి అధికారం రానుందని చెబుతున్నాయి. ఇప్పటికే ఇండియా టుడే, టైమ్స్ నౌ, తదితర చానళ్లు ముందస్తుగా ప్రకటించాయి కూడా.
తాజాగా బుధవారం జన్ మత్ సంస్థ ముందస్తు సర్వే ఫలితాలు వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఏపీలోని మొత్తం 175 శాసన సభ స్థానాలకు గాను టీడీపీ కూటమికి 110 నుంచి 115 సీట్లు రాబోతున్నాయని, మొత్తంగా 144 సీట్లు కైవసం చేసుకునే అవకాశం లేక పోలేదని పేర్కొంది.
ఇక పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి 15 నుంచి 18 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది జన్ మత్ సంస్థ. ఇక భారతీయ జనతా పార్టీ 2 నుంచి 3 సీట్లు కైవసం చేసుకోనుందని తెలిపింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క సీటుకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది.
విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం పవర్ లో ఉన్న వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా కడప లోక్ సభ స్థానంలో ప్రధానంగా పోటీ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉండనుందని పేర్కొంది. ఇక్కడ వైసీపీ మూడో స్థానంలో నిలవనుంది.