NEWSANDHRA PRADESH

15 నుండి టీడీపీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా వేదిక

Share it with your family & friends

ప్ర‌క‌టించిన తెలుగుదేశం పార్టీ

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో అక్టోబర్ 15 నుంచి ప్ర‌జా వేదిక కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది.

తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేర‌కు ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ప్ర‌జా వేదిక నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా 14 నుండి ప‌ల్లె పండుగ చేప‌ట్ట‌నున్న‌ట్లు దీని కార‌ణంగా 15 నుంచి ప్ర‌జా వేదిక ఉంటుంద‌ని తెలిపింది పార్టీ.

15న జ‌రిగే ప్ర‌జా వేదిక‌లో మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, ఎంపీ గ‌న్ని వీరాంజ‌నేయులు, 16న ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేఎస్ జ‌వ‌హ‌ర్ , 17న మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ‌రామ్ రాజ‌గోపాల్ తాత‌య్య పాల్గొంటార‌ని తెలిపింది టీడీపీ.

18న జ‌రిగే ప్ర‌జా వేదిక‌లో టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు , మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, 19న ప‌ల్లాతో పాటు మంత్రి వాసంశెట్టి సుభాష్, 21న మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, టీడీపీ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వైకుంఠం చౌద‌రి, 22న ఎస్. స‌విత , ఎంపీ నెట్టెం ర‌ఘురాం, 23న మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌ణివాస్, ఎమ్మెల్సీ దువ్వార‌పు రామారావు పాల్గొంటార‌ని టీడీపీ పేర్కొంది.

24న మంత్రి టీజీ భ‌ర‌త్ , ఏపీటీసీ చైర్మ‌న్ నూక‌సాని బాలాజీ, 25న టీడీపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు, మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్, 26న ప‌ల్లా శ్రీ‌నివాస‌రావుతో పాటు మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్, 28న మంత్రి డోలా బాల వీరాంజ‌నేయ స్వామి, టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్యుడు రెడ్డెప్ప గారి శ్రీ‌నివాస్ రెడ్డి, 29న మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు, ఏపీహెచ్ ఆర్ సీ చైర్మ‌న్ బ‌త్తుల తాత‌య్య‌, 30న మంత్రి నిమ్మ‌ల రామా నాయుడుతో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్య‌క్షుడు కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డి, 31న మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్ , టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కుంభంపాటి రామ్మోహ‌న్ రావు హాజ‌ర‌వుతుఆర‌ని ఎమ్మెల్సీ ప‌ర్చూరి అశోక్ బాబు తెలిపారు.