ANDHRA PRADESHNEWS

ప్ర‌జా వేదిక‌లో పాల్గొన‌నున్న మంత్రులు

Share it with your family & friends

డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 11 దాకా

అమ‌రావ‌తి – మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం ఎన్టీఆర్ భవన్ లో “ప్రజా వేదిక” కార్యక్రమం నిర్వహించబడుతుంది. డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని తెలిపింది పార్టీ.

డిసెంబ‌ర్ 30న సోమ‌వారం జ‌రిగే ప్ర‌జావేదిక కార్య‌క్ర‌మంలో మంత్రి వాసంశెట్టి సుబ్బ‌య్య‌, ఎంపీ, టీటీడీ బోర్డు మెంబ‌ర్ రాజ‌శేఖ‌ర్ గౌడ్ , ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు పాల్గొంటారు.

జ‌న‌వ‌రి 2న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , 3న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ , రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ కంభంపాటి రామ్మోహన్ రావు పాల్గొంటార‌ని తెలిపింది .

జ‌న‌వ‌రి 4న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ , రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతారామ సుధాకర్ , 6న రాష్ట్ర మంత్రివర్యులు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు పాల్గొంటార‌ని తెలిపింది టీడీపీ.

7న మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, స్వ‌చ్ఛ ఏపీ మిష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్, 8న మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్ , ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ , ఏపీ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ పీతల సుజాత హాజ‌ర‌వుతారు.

9వ తేదీన మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి, ప్ర‌భుత్వ చీఫ్ విప్ , ఎమ్మెల్సీ పంచుమ‌ర్తి అనురాధ‌, ఏపీ విమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కావలి గ్రీష్మ, 10న టీడీపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస్ , మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొంటారు. 11న టీడీపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస్ , మంత్రి ప‌య్యావుల కేశవ్ , ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వర రావు పాల్గొంటార‌ని పేర్కొంది టీడీపీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *