ఎట్టకేలకు కుదిరిన పొత్తులు
టీడీపీ..జనసేన..బీజేపీ
అమరావతి – ఏపీలో రాజకీయ సమీకరణలు మారాయి. నువ్వా నేనా అన్న రీతిలో ఈసారి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్టోపస్ లాగా విస్తరించిన జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీని ఎదుర్కొనేందుకు తమ బలం సరిపోదని భావించారు చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన తాను విమర్శిస్తూ వచ్చిన మోదీ, అమిత్ షా పంచన చేరారు. చివరకు అధికారం కోసం ఏమైనా చేసేందుకు , ఎవరితోనైనా కలిసేందుకు రెడీ అన్న సంకేతం ఇచ్చారు.
బాబు , పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం, బీజేపీతో చర్చలు ఫలప్రదం కావడంతో ఎట్టకేలకు సంతోషానికి లోనయ్యారు చంద్రబాబు. కానీ పొత్తుల్లో భాగంగా ఆయా నియోజకవర్గాలలో మూడు పార్టీల మధ్య ఆశావహులు పెరిగి పోయారు. దీంతో పెద్ద ఎత్తున ఒత్తిడి ఎదుర్కోనున్నారు చంద్రబాబు నాయుడు.
ఇప్పటికే చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. బాబు అసెంబ్లీ బరిలో ఉంటే పవన్ మాత్రం కాకినాడ నుంచి ఎంపీగా బరిలో ఉంటారని టాక్. రాబోయే రోజుల్లో ఈ పొత్తుల ప్రభావం ఏ మేరకు జగన్ కు ఎఫెక్ట్ చూపిస్తాయనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది. మొత్తంగా పొత్తుల కూటమిలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరింత కీలకంగా మారనున్నారనేది వాస్తవం.