NEWSANDHRA PRADESH

గ‌న్ మెన్ వ‌ల్లే బ‌తికా – నాని

Share it with your family & friends

పులివ‌ర్తి నాని డిశ్చార్జ్

తిరుప‌తి – పోలింగ్ సంద‌ర్భంగా దాడికి గురైన టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి పులివ‌ర్తి నాని తిరుప‌తి లోని స్విమ్స్ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్క‌డి నుంచి నేరుగా చంద్రగిరిలో ఉన్న గన్ మాన్ ధరణి ఇంటికి చేరుకున్నారు.

ధరణి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పులివ‌ర్తి నాని. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గన్ మాన్, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే ఇవాళ తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదన్నారు.

వాళ్లు చూపిన ధైర్యసాహసాలు అభినందనీయం అని కొనియాడారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారని పులివ‌ర్తి నాని ఆరోపించారు. టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న, పెద్ద, ముసలి, ముతకను పట్టుకుని చితక బాదారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్దతులు కాదన్నారు. చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని కోరారు. పోలీసులు బాధ్యతగా వారి విధులు నిర్వహించారని ప్ర‌శంసించారు.