చంద్రబాబు నాయుడు ప్రకటన
అమరావతి – ఈసారి రాయలసీమలోని కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించనున్నట్లు ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తన అధ్యక్షతన పార్టీ పోలిట్ బ్యూరో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. కనీవిని ఎరుగని రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో టీడీపీ ఏకంగా కోటి మంది సభ్యత్వాలను పూర్తి చేయడం జరిగందన్నారు. ఇదే స్పూర్తి భవిష్యత్తులో కొనసాగించాలన్నారు.
ఈ సందర్బంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మెంబర్లు, డైరెక్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు.
గెలిచామని సంబర పడిపోతే సరిపోదన్నారు నారా చంద్రబాబు నాయుడు. మన ముందు భారీ లక్ష్యాలు ఉన్నాయని , అది గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. ఎవరైనా సరే పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు.