ఉండవల్లి శ్రీదేవికి బిగ్ షాక్
ప్రకటించిన చంద్రబాబు నాయుడు
అమరావతి – వైఎస్సార్ సీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిన ఉండవల్లి శ్రీదేవికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. శనివారం టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 99 సీట్లను ప్రకటించారు. ఇందులో 94 సీట్లను టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తే 5 సీట్లను జనసేన వెల్లడించింది.
తాడికొండ నియోజకవర్గం నుంచి తనకు ఎమ్మెల్యే టికెట్ టీడీపీ నుంచి వస్తుందని ఆశించింది. ఆ మేరకు తనకు చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పలుమార్లు పదే పదే ప్రకటించింది. బహిరంగ వేదికలపై కూడా తెలిపింది.
అయితే ఊహించని రీతిలో ఉండవల్లి శ్రీదేవికి దిమ్మ తిరిగేలా టికెట్ ఖరారు చేయలేదు నారా చంద్రబాబు నాయుడు. శ్రీదేవికి బదులు శ్రవణ్ కుమార్ ను ఖరారు చేశారు. తనకు టికెట్ కేటాయించక పోవడంపై తీవ్ర నిరావకు లోనయ్యారు. తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనంటూ పేర్కొన్నారు.