NEWSANDHRA PRADESH

విలువ‌ల‌కు పెద్ద‌పీట ప్ర‌జాస్వామ్యానికి ప్రాధాన్య‌త‌

Share it with your family & friends

టీడీపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస్ రావు కామెంట్స్

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ చ‌ల్లా శ్రీ‌నివాస్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌కీయ విలువల‌కు ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడేందుకు త‌మ నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నం చేస్తార‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయ‌న చేసిన నిర్వాకం కార‌ణంగానే ఇవాళ ఏపీ అన్ని రంగాల‌లో నాశ‌నం అయ్యింద‌ని ఆరోపించారు.

రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగించాడ‌ని, అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు టీడీపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు. త‌మ ప్ర‌భుత్వం రాజ‌కీయ విలువ‌ల‌కు ప్ర‌యారిటీ ఇస్తుంద‌ని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

జ‌గ‌న్ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కే ప్ర‌య‌త్నం చేశార‌ని, తాను మాత్ర‌మే ఉండాల‌ని కోరుకున్నాడ‌ని కానీ ప్ర‌జ‌లు డెమోక్రసీకి ఓటు వేశార‌ని, 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని అయినా బుద్ది రాలేద‌న్నారు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు.

పెద్ద‌ల స‌భ‌ను గౌర‌వించాల‌నే ఉద్దేశంతోనే తాము విశాఖ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నుంచి త‌ప్పు కోవ‌డం జ‌రిగింద‌న్నారు.