అరుదైన రికార్డ్ సృష్టించిన పార్టీ
అమరావతి – తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఏకంగా కోటి మంది సభ్యత్వాలను కలిగి ఉంది. ప్రాంతీయ పార్టీలలో ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు భీమా సదుపాయం కల్పిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ బాస్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పార్టీలో చేరాలని ఇచ్చిన పిలుపునకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది.
గ్రామ స్థాయి నుంచి పట్టణ, జిల్లా, నగర స్థాయి దాకా టీడీపీ సభ్యత్వాలను నమోదు చేయిస్తోంది. పార్టీలో చేరేందుకు ఎక్కువగా యువతీ యువకులు పోటీ పడుతుండడం విశేషం. కోటి సభ్యత్వాలు అంటే కోటి మంది సైనికులను కలిగి ఉన్నట్టేనని అన్నారు ఈ సందర్భంగా నారా లోకేష్.
ఇది తెలుగుదేశం పార్టీ సాధించిన అరుదైన రికార్డుగా ఆయన అభివర్ణించారు. ఇందులో నమోదైన ప్రతి సభ్యత్వం వెనుక తన తండ్రి, సీఎం చంద్రబాబు నాయుడు పట్టుదల దాగి ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఉన్నాయన్నారు.
ఇదిలా ఉండగా నారా లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు పార్టీ బాస్, సీఎం నారా చంద్రబాబు నాయుడు . తన పట్టుదల వల్లనే ఇది సాధ్యమైందన్నారు.