NEWSANDHRA PRADESH

తాడేప‌ల్లి గూడెం స‌భ‌పై ఫోక‌స్

Share it with your family & friends

జ‌గ‌న్ కు దిమ్మ తిరిగేలా స‌భ

అమ‌రావ‌తి – ఏపీలో ఎన్నిక‌ల శంఖారావానికి శ్రీ‌కారం చుట్టాయి టీడీపీ, జ‌న‌సేన పార్టీలు. ఇప్ప‌టికే పొత్తును ఖ‌రారు చేశాయి. క‌లిసి కూట‌మిగా ముందుకు వెళ్ల‌నున్నాయి. నిన్న ఆయా పార్టీలు 99 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. 94 సీట్ల‌కు టీడీపీ నుంచి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌గా మిగ‌తా 5 సీట్ల‌ను జ‌న‌సేన వెల్ల‌డించింది.

ఇది ప‌క్క‌న పెడితే ఈనెల 28న తాడేప‌ల్లిగూడెం వేదిక‌గా టీడీపీ, జ‌న‌సేన స‌మన్వ‌యంతో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాయి. ఇందుకు సంబంధించి ఇరు పార్టీల‌తో క‌లిపి స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండ‌గా ఈ స‌భ‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప్ర‌త్తిపాటి పుల్లారావు. ఇరుపార్టీల మధ్య పొత్తు, ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత కంచుకోట లాంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న తొలి భారీ కార్యక్రమం కావడంతో ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలని పార్టీ నేత‌లు, కార్య‌కర్త‌ల‌కు సూచించారు.

ప్రత్తిపాడులో ఆరు లక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో వైకాపాకు ఒక్క సీటు కూడా దక్కకుండా క్వీన్ స్వీప్ చేస్తామని స్పష్టం చేశారు.

ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ జోన్‌-2 ఇన్‌ఛార్జిగా తాడేపల్లిగూడెంలోని మారిశెట్టి ఫంక్షన్‌ హాల్‌లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశం నిర్వహించారు.

బహిరంగ సభకు 175 నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించే సభ చరిత్రలో నిలిచిపోయేలా, వైకాపాను ఇంటికి పంపించేలా ఉండబోతుందన్నారు.