లోకేష్ డిప్యూటీ సీఎం కామెంట్స్ పై
అమరావతి – తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రి నారా లోకేష్ కు సంబంధించి పెద్ద ఎత్తున మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కామెంట్స్ మరోసారి చేయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఇలాంటి మాటలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించి పార్టీ హైకమాండ్. నారా లోకేశ్ ని డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదన చేయడంలో తప్పు లేదని, కానీ ఇలాంటి నిర్ణయంపై తాము స్పందించ లేదన్నారు.
ఏది ఏమైనా ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీతో పాటు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్న విషయం గుర్తించాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏదైనా కూటమి ఒప్పందంలోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ విషయం గమనించాలని స్పష్టం చేశారు.