టీడీపీ..జనసేన కూటమి ప్రకటన
అమరావతి – ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారి పోతున్నాయి. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నాయి ప్రతిపక్షాలు. ప్రధానంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కీలకంగా మారారు. ఈసారి రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఫోకస్ పెట్టారు. పొత్తులో భాగంగా మొత్తం 175 స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయడంపై ఉత్కంఠ నెలకొంది.
చాలా చోట్ల టీడీపీ వర్సెస్ జనసేన పార్టీకి ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఇవాళ ఇరు పార్టీలకు సంబంధించి పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేశారు ఇరువురు నేతలు.
అయితే ఎవరెవరి పేర్లు ఉంటాయనే దానిపై టెన్షన్ నెలకొంది అభ్యర్థులలో. టీడీపీ సిట్టింగ్ అందరి పేర్లు ఉంటాయా ఉండవా అనే దానిపై డైలమా నెలకొంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ రెడ్డి, గంటా శ్రీనివాసరావు పేర్ల ప్రకటనపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. మొత్తంగా బీసీ, ఎస్సీ, కాపు తదితర సామాజిక సమీకరణలతో కూటమి తొలి జాబితాను ప్రకటించనున్నారు చంద్రబాబు , పవన్ కళ్యాణ్.