NEWSANDHRA PRADESH

సీట్ల కేటాయింపుపై క‌స‌ర‌త్తు

Share it with your family & friends

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకం అయ్యేందుకు వ్యూహాలు ప‌న్నుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో వైసీపీతో పాటు తెలుగుదేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పోటీ ప‌డుతున్నాయి.

గ‌తంలో బీజేపీతో జ‌త క‌ట్టిన చంద్ర‌బాబు నాయుడు ఆ పార్టీకి దూర‌మ‌య్యారు. యూపీఏతో జ‌త క‌ట్టారు. మోదీని, బీజేపీని అన‌రాని మాట‌లు అన్నారు. ఆ త‌ర్వాత వైసీపీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. త‌ను అధికారాన్ని కోల్పోయాడు. జ‌గ‌న్ రెడ్డి దాడి చేయ‌డం మొద‌లు పెట్టారు. చివ‌ర‌కు ఏపీ స్కిల్ స్కామ్ లో జైలు పాల‌య్యారు.

53 రోజుల పాటు ఉన్న ఆయ‌న బెయిల్ పై బ‌య‌ట‌కు రావ‌డానికి నానా తంటాలు ప‌డ్డారు. 40 ఏళ్ల రాజ‌కీయ జీవితం అంటూ చెబుతూ వ‌స్తున్న బాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాబుతో జ‌త క‌ట్టారు. తాజాగా స‌ర్వేల్లో ఏపీలో జ‌న‌సేన కీల‌కం కానుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం వైకాపాను ఎలాగైనా ఓడించాల‌ని టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కంక‌ణం క‌ట్టుకున్నాయి.

ఈ మేర‌కు చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. అమిత్ షా, న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు. పొత్తు పెట్టుకునేందుకు ఆస‌క్తి చూపారు.