NEWSANDHRA PRADESH

ఏపీలో జ‌గ‌న్ రాక్ష‌స పాల‌న

Share it with your family & friends

టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్

అమ‌రావ‌తి – ఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా విఫ‌లం చెందాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీ టీడీపీ చీఫ్ కింజార‌పు అచ్చెన్నాయుడు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డికి తన ఆర్దిక భద్రతపై ఉన్న శ్రద్ధ శాంతి భద్రతలపై లేదన్నారు. తహసీల్దార్ రమణయ్య హత్య రాష్ట్రంలో శాంతి భద్రతలకు అద్దం పడుతోందని మండిప‌డ్డారు.

చట్టబద్దంగా పని చేస్తూ వైసీపీ నేతల అవినీతికి అడ్డు తగిలిన అధికారులపై వేధింపులకు పాల్ప‌డ‌డం దారుణ‌మ‌న్నారు. రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగంగా మారింద‌న్నారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో తహశీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గమ‌న్నారు.

గత ఐదేళ్ల నుంచి విశాఖను భూకబ్జాలు, ప్రజల ఆస్తుల విధ్వంసం, కమీషన్లు, సెటిల్ మెంట్లకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. ప్రజలు, అధికారులపై బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, శిరోముండనాలు వైసీపీ పాలనలో నిత్యకృత్యంగా మారాయ‌ని ఆవేద‌న చెందారు.

మంత్రుల‌ నుంచి వాలంటీర్ల వరకు అధికారులపై దాడులు, బూతులతో విరుచుకు పడుతున్నారని ఫైర్ అయ్యారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అవనీతికి సహకరించలేదన్న కారణంతో దళిత కలెక్టర్ గంధం చంద్రుడిపై దౌర్జన్యం చేయక, బదిలీ చేయించుకున్నారని మండిప‌డ్డారు.

గుడివాడలో భూకబ్జాను అడ్డుకున్న వీఆర్వోను జేసీబీతో తొక్కి చంపేందుకు కొడాలి నాని అనుచరులు యత్నించారని,. శాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి శాఫ్ అధికారులను మీటింగ్ లో అహంకారపూరితంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడి వారిని అగౌరవ ప‌రిచారంటూ ధ్వ‌జ‌మెత్తారు. కార్ పార్కింగ్ విషయంలో మాజీ మంత్రి పేర్నినాని పోలీసులను బండ బూతులు తిట్టాడని అన్నారు.