టీడీపీ నేత వెంకన్న కామెంట్స్
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తిక్క కుదిరిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. నోటికి వచ్చినట్టు మాట్లాడాడని, చివరకు కర్మ ఫలితం అనుభవించాడని అన్నారు. వంశీ అరెస్ట్ తో ఇంత కాలానికి శిక్ష పడిందని ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. పిల్ల సైకోకు పెద్ద సైకో మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. ఆనాడు ఏపీలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వంశీ రెచ్చి పోయాడని, అనరాని మాటలు అన్నాడని, చంద్రబాబు, ఆయన భార్య , కొడుకును దూషించాడని..జైలు పాలయ్యాడని ఎద్దేవా చేశారు.
శనివారం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే వంశీ ఆగడాలు భరించలేక ప్రజలే తగిన బుద్ది చెప్పి ఓడించారన్నారు. అయినా ఇప్పటికీ ఇంకా బుద్ది రాలేదన్నారు. వంశీ, కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారన్నారు. ఆరోజు వారందరితో బండ బూతులు తిట్టించిన జగన్ .. ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు.
అందుకే జనం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ లు సిగ్గూ శరం లేకుండా మాట్లాడినా జగన్ భుజం తట్టి ప్రోత్సహించాడని ధ్వజమెత్తారు. వాళ్లిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడ లేదని గుర్తు చేశారు. అలా ఎవరైనా వాగితే.. మా అధినేత చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేసే వారన్నారు.