టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
విజయవాడ – లిక్కర్ స్కాంపై కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణతో వైసీపీ నేతల్లో భయం నెలకొందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. అందుకే ప్రజలను మభ్య పెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారని, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన గత సర్కార్ లో కీలక పాత్ర పోషించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు .
కావాలని పుంకాను పుంకాలు అబద్దాలు రాస్తూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని. ధ్వజమెత్తారు. సిట్ దుబాయికి వెళ్లి విచారణ మొదలు పెడితే మాకొద్దు ఈ రాజకీయం అని దోపిడీదారులు పారిపోతారంటూ ఎద్దేవా చేశారు.
అవినీతికి పాల్పడిన ఏ స్థాయి వ్యక్తిని కూడా చట్టం క్షమించదన్నారు వర్ల రామయ్య. మద్యం కుంభకోణలో సిట్ లోతుగా దర్యాప్తు చేసి దోషులందరిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ధనుంజయ్ రెడ్డికి సంబంధించిన ఓ మహిళ దుబాయి నుండి తరలించిన బంగారంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పాలనలో మన రాష్ట్రంలో భారీ లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు. నాసిరకం మద్యం అమ్మకాలతో వేలాది మంది ప్రజల ప్రాణాలు పోయాయని వాపోయారు. లక్షలాది మంది అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు.
లిక్కర్ లో రూ.3,200 కోట్ల అవినీతి కేసుపై కూటమి ప్రభుత్వం సిట్ వేసి దర్యాప్తు చేస్తుంటే వైకాపాలోని నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారంటూ ప్రశ్నించారు వర్ల రామయ్య. ఒకవేళ అవినీతికి పాల్పడక పోతే విచారణకు సహకరించాలన్నారు