60 లక్షలు దాటిన టీడీపీ సభ్యత్వం
ప్రకటించిన మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ రికార్డ్ స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేసింది. గత అక్టోబర్ నెల 26న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే 2026 వరకు ఇది కొనసాగుతుందని ఇప్పటికే పార్టీ స్పష్టం చేసింది.
కేవలం రెండు నెలల కాలంలోనే సభ్యత్వ నమోదులో వేగం పెంచింది. ఏకంగా 60,00,000 మంది సభ్యత్వం తీసుకున్నారని, పార్టీ పరంగా ఇది ఓ రికార్డ్ అని స్పష్టం చేశారు పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్.
ఇదే స్పూర్తితో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విధిగా సభ్యత్వం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి సులభంగా ఆన్ లైన్లోనే తీసుకునే వీలు కూడా ఉందని తెలిపారు.
వాట్సాప్ ద్వారా అయితే http://bit.ly/3UsvoJx లింక్ ను, టెలిగ్రామ్ ద్వారా అయితే https://t.me/MyTDP_bot లింక్ ను, వెబ్ సైట్ ద్వారా అయితే https://telugudesam.org/membership-2024-26/ లింక్ ను ఉపయోగించాలని కోరారు.