శాన్ ఫ్రాన్సిస్కో లో ఐటీ సదస్సుకు హాజరు
అమెరికా – ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా శనివారం చేరుకున్నారు. ఈ సందర్బంగా శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో దిగిన లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున టీడీపీ ఎన్నారై సంఘం ఆధ్వర్యంలో పలువురు సాదర స్వాగతం పలికారు తమ నాయకుడికి.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు ఆత్మీయంగా పలకరించారు. ఈ నెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరు కానున్నారు నారా లోకేష్. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
దీపావళి పండుగను కూడా నారా లోకేష్ అమెరికా పర్యటనలో చేసుకుంటారు. ఏపీలో తాజాగా కొలువు తీరిన కూటమి సర్కార్ ఐటీ, లాజిస్టిక్ , వ్యాపార, వాణిజ్య రంగాలలో అనుభవం కలిగిన వ్యాపారవేత్తలు, ఐటీ ఎక్స్ పర్ట్స్ తో ఈ సందర్బంగా భేటీ కానున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్.
తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి, ప్రధానంగా పెట్టుబడిదారులకు పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు . ఎవరైనా ఇక్కడికి రావచ్చని, ప్రధానంగా సాంకేతికతలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా తాము త్వరలో ఏఐ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు నారా లోకేష్.