NEWSANDHRA PRADESH

ప్ర‌జా వేదిక పునః ప్రారంభం – టీడీపీ

Share it with your family & friends

మంగ‌ళ‌గిరి వేదిక‌గా జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మంగళవారం నుండి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం పునః ప్రారంభం అవుతుంద‌ని తెలిపింది. ఈ మేర‌కు సోమ‌వారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర‌కు రేపటి నుండి అనగా తేది 17న మంగళవారం నుంచి “ప్రజా వేదిక” కార్యక్రమం పునః ప్రారంభించ బడుతుందని స్ప‌ష్టం చేసింది.

ఇందులో భాగంగా ఎన్టీఆర్ భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటారని పార్టీ ప్ర‌క‌టించింది. ప్రజల వద్ద నుంచి వారు అర్జీలు స్వీకరిస్తారని తెలిపింది.

17న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య , ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొంటార‌ని, 18న ఎమ్మెల్సీ న‌క్కా ఆనంద‌బాబు, ఎమ్మెల్యే మొహ‌మ్మ‌ద్ న‌జీర్ అహ్మ‌ద్ , 19న రాష్ట్ర మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ , ఎమ్మెల్యే బూర్ల రామాంజ‌నేయులు పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేసింది టీడీపీ. ఈ కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎమ్మెల్సీ ప‌ర్చూరి అశోక్ బాబు కోరారు.