NEWSANDHRA PRADESH

ఫోన్ చేయండి సీఎంను క‌ల‌వండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మంగ‌ళ‌గిరి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం , త‌మ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌దైన పాల‌న సాగిస్తున్న‌రాని కొనియాడారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని చెప్పార‌ని, 5 ఫైల్స్ పై సంత‌కం చేశార‌ని చెప్పారు.

కాగా ప్ర‌తి శ‌నివారం చంద్ర‌బాబు నాయుడు పార్టీ ఆఫీసులో ప్ర‌జ‌ల నుంచి విన‌త‌లు స్వీక‌రిస్తున్నార‌ని తెలిపారు. ఈ సందర్భంగా బాబుతో ఫోటోల కోసం వచ్చే వారితో, నిజమైన సమస్యలతో వచ్చే వారు తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు గాను ముందుగా త‌మ‌కు ఫోన్ చేస్తే , ప్ర‌యారీటీ ప్ర‌కారం వ‌చ్చే వారిని నారా చంద్రబాబు నాయుడును క‌లిసేలా చేస్తామ‌న్నారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు.

7306299999 నంబర్ కి ఫోన్ చేసి ముందుగా త‌మ‌కు తెలియ చేయాల‌ని కోరారు.