ఆయనకు చంద్రబాబు రాజకీయ భిక్ష
అమరావతి – టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని వంటి వారికి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. అయినా విశ్వాసం లేకుండా తమ నాయకుడిపై చవకబారు విమర్శలకు దిగాడని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. టీడీపీ ఎంపీగా ఉంటూనే మాజీ సీఎం జగన్ కు కోవర్టుగా పని చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. 2019-24 వరకు చంద్రబాబు, లోకేష్, నేను ఇతర నేతలు మద్యం కుంభకోణంపై గళమెత్తామన్నారు. జగన్, అండ్ కో మద్యం మాఫియాపై పోరాటాలు చేశామని గుర్తు చేశారు బుద్దా వెంకన్న.
అవినీతి సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుందని ఆరోజే చెప్పామన్నారు. అయినా జగన్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ కేశినేని నానిపై ఫైర్ అయ్యారు . కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియాపై సిట్ విచారణ చేపట్టిందన్నారు. కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారిగా మొత్తం వ్యవహారం నడిచిందని సిట్ నిర్ధారించిందన్నారు. ఇప్పుడు జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. దోషులు ఎవరైనా తప్పించు కోలేరంటూ వార్నింగ్ ఇచ్చారు బుద్దా వెంకన్న. దీంతో విషయం పక్కదారి పట్టించేందుకు జగన్ కొత్త నాటకాలు ప్రారంభించాడని ఫైర్ అయ్యారు.