జగన్ నీకంత సీన్ లేదు – టీడీపీ
ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్
అమరావతి – సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం కొనసాగుతోంది టీడీపీ, వైసీపీ మధ్య. బుధవారం జగన్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చింది టీడీపీ. లండన్ పై ఉన్న ప్రేమతో హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేక పోయావంటూ ఎద్దేవా చేసింది జగన్ రెడ్డిని ఉద్దేశించి.
మీడియాను అడ్డం పెట్టుకుని చేయని దానికి కూడా చేసినట్టు బిల్డప్ ఇచ్చామని, దీంతో ప్రజలు వై నాట్ 175 అంటే 11 సీట్లకు పరిమితం చేశారని , నిన్ను పులివెందుల బెటర్ అంటూ తీర్పు చెప్పారని అయినా బుద్ది రాలేదంటూ మండి పడింది టీడీపీ.
ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారోనని ప్యాలెస్ లో నుంచి బయటకు రాకుండా బ్రతికావని, ప్రశ్నించిన వారిని చంపించావని, సొంత తల్లిని, చెల్లిని కూడా గెంటేసిన నీచమైన చరిత్ర నీదంటూ సంచలన ఆరోపణలు చేసింది .
మెడలు వంచుతా అన్నావ్, కాళ్ళ మీద పడ్డావ్ , వారంలో సీపీఎస్ రద్దు అన్నావు నా వల్ల కాదని పంగనామాలు పెట్టావంటూ మండిపడింది. ఎంత మంది పిల్లలున్నా అమ్మ ఒడి అన్నావ్, నాటకాలు ఆడావ్..మద్య నిషేధం అన్నావ్, నువ్వే మద్యం తయారు చేసి అమ్ముకున్నావంటూ సంచలన ఆరోపణలు చేసింది టీడీపీ.
జాబ్ క్యాలెండర్ అన్నావ్, సాక్షి క్యాలెండర్ ఇచ్చావని ఎద్దేవా చేసింది. భ్రమల్లో కాకుండా వాస్తవంలో బ్రతుకు అంటూ హితవు పలికింది.