NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ ర‌క్తం పారించిన చ‌రిత్ర నీది

Share it with your family & friends

నిప్పులు చెరిగిన తెలుగుదేశం పార్టీ

అమ‌రావ‌తి – మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది టీడీపీ. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

నీటి పారుద‌ల గురించి నీకేం తెలుసు అని ప్ర‌శ్నించింది. చంద్ర‌బాబు నాయుడు చ‌రిత్ర తెలుసు కోకుండా అనుచితంగా మాట్లాడటం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించింది. బాబు నీళ్లు పారిస్తే ..జ‌గ‌న్ రెడ్డి నువ్వు ర‌క్తం పారించావంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

హంద్రీనీవా, గాలేరు నగిరి పరుగులు పెట్టించింది చంద్ర‌బాబు అన్న విష‌యం ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని అది తెలుసుకోకుండా అవాకులు పేలితే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించింది టీడీపీ. చిత్తూరు జిల్లాలోకి కృష్ణమ్మని తీసుకొచ్చిందే చంద్రబాబు అని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 87 శాతం పూర్తి చేసిన విష‌యం తెలియ‌క పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొంది.

తాము వ‌దిలి వేసిన 13 శాతం ప‌నులు చేసేందుకు నీకు 57 నెల‌ల కాలం ప‌ట్టిందంటూ ఎద్దేవా చేసింది.