NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ నిర్వాకం పెద్ద‌ల స‌భ అపహాస్యం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన తెలుగుదేశం పార్టీ

అమ‌రావ‌తి – ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరిగింది. రాష్ట్రంలో ఇటీవ‌ల చోటు చేసుకున్న వ‌రుస ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. ఈ సంద‌ర్బంగా రోజు రోజుకు వైసీపీ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధుల రాస‌లీల ఘ‌ట‌న‌లతో పాటు లైంగిక వేధింపుల‌కు సంబంధించిన కేసులు న‌మోదు కావ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది.

గ‌త 5 సంవ‌త్స‌రాల కాలంలో మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని, దోచుకోవ‌డం దాచుకోవ‌డం మాత్ర‌మే చేశాడ‌ని ఆరోపించింది టీడీపీ. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు రెచ్చి పోయార‌ని, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, దాడుల‌కు తెగ బ‌డ్డార‌ని వాపోయింది. అంతే కాకుండా లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డారంటూ ఆరోపించింది.

కనీస విలువలు లేని అనంతబాబు, దువ్వాడ, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని నామినేట్ చేసి మరీ పెద్దల సభకు పంపించింది మీరు కాదా అని ప్ర‌శ్నించింది. అంతే కాకుండా ఇలాంటి పోరంబోకు పనులు చేయటానికా అని నిల‌దీసింది.

ఈ సంద‌ర్బంగా కొత్తగా శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఎన్నికైన బొత్సా స‌త్య‌నారాయ‌ణ గారు ఏమంటారంటూ ప్ర‌శ్నించింది.