ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ – భారత ప్రభుత్వం అరుదైన ఘనతను సాధించిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తనతో పాటు నలుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారని తెలిపారు. దావోస్ పర్యటనలో టీమిండియా ఏకంగా రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడం జరిగిందన్నారు. ఇది గతంలో ఎన్నడూ లేదన్నారు. మోడీ నేతృత్వంలో ఇండియా బ్రాండ్ కు దక్కిన గౌరవమన్నారు.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రకు రూ. 15.7 లక్షల కోట్లు మొత్తంలో 80 శాతం , 16 లక్షల ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించారు కేంద్ర మంత్రి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే రూ. 1.79 లక్షల కోట్లు, 50 వేల జాబ్స్ రానున్నాయని పేర్కొన్నారు. దావోస్ పర్యటన ముగిసిన సందర్బంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.
ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, టెక్, డేటా సెంటర్ల ఏర్పాటుపై ఎక్కువగా దృష్టి సారించామన్నారు. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ ఇవాళ ఇండియా వైపు చూస్తున్నాయని చెప్పారు అశ్విని వైష్ణవ్. ఈ క్రెడిట్ అంతా తమ డైనమిక్ నాయకుడైన నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైందన్నారు.