దిగజారిన టీమిండియా ర్యాంకింగ్
న్యూజిలాండ్ తో సీరీస్ వైట్ వాష్
హైదరాబాద్ – ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో ఘోరంగా ఓటమి పాలై సీరీస్ కోల్పోయిన భారత జట్టు కు బిగ్ షాక్ తగిలింది. దీంతో డబ్లుటీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడి పోయింది. స్వదేశంలో దుమ్ము రేపుతారని, కీవీస్ ను ఓడిస్తారని అనుకున్న క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చారు భారత క్రికెటర్లు.
ప్రధానంగా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తో పాటు ఇతర ఆటగాళ్లు సరైన సమయంలో రాణించ లేక పోయారు. స్పిన్ ను ఆడడంలో పేరు పొందిన భారత ఆటగాళ్లు విచిత్రంగా కీవీస్ బౌలర్ల ధాటికి తలవంచారు. బెంగళూరు, పూణే, ముంబైలలో వరుసగా జరిగిన 1వ, 2వ, 3వ టెస్టు మ్యాచ్ లలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. తల దించుకునేలా చేశారు.
మరో వైపు టి20, వన్డే సీరీస్ బంగ్లాదేశ్ తో గెలిచిన ఆనందం ఆవిరై పోయింది న్యూజిలాండ్ కొట్టిన దెబ్బకు. దీంతో టెస్టు ర్యాంకింగ్ పాయింట్ల పట్టికలో వెనక్కి వెళ్లింది టీమిండియా. అగ్రస్థానం కోల్పోయింది. త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది . 58.33 శాతంతో 2వ స్థానానికి పడి పోయింది టీమిండియా ర్యాంక్. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 62.5 కంటే వెనుకబడి ఉంది.
ఇక ఆయా దేశాల వారీగా ర్యాంకింగ్స్ చూస్తే..టాప్ 1లో ఆసిస్ జట్టు కొనసాగుతుండగా భారత్ 2వ స్థానంలో , శ్రీలంక మూడో ప్లేస్ లో, న్యూజిలాండ్ 4వ స్థానంలో, 5వ ప్లేస్ లో దక్షిణాఫ్రికా, 6వ స్థానంలో ఇంగ్లండ్ , 7వ ప్లేస్ లో పాకిస్తాన్ , 8వ స్థానంలో బంగ్లాదేశ్, 9వ స్థానంలో వెస్టిండీస్ కొనసాగుతున్నాయి.