SPORTS

భార‌త్ ప్రైజ్ మ‌నీ రూ. 20.40 కోట్లు

Share it with your family & friends

ర‌న్న‌ర‌ప్ ద‌క్షిణాఫ్రికాకు రూ. 10.67 కోట్లు

బ్రిడ్జిట్ టౌన్ – వెస్డిండీస్ లోని బ్రిడ్జ్ టౌన్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. ప్ర‌త్య‌ర్థి ద‌క్షిణాఫ్రికా టీమ్ ను మ‌ట్టి క‌రిపించింది. ఏడు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

రోహిత్ శ‌ర్మ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 176 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన దక్షిణాప్రికా 169 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ సూప‌ర్ షో చేశాడు. 59 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 76 ర‌న్స్ చేశాడు. అక్ష‌ర్ ప‌టేల్ 31 బంతులు ఎదుర్ఒక‌ని ఫోర్ , 4 సిక్స్ ల‌తో 47 ర‌న్స్ చేశాడు.

ఇక ద‌క్షిణాఫ్రికా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్ 27 బంతుల్లో 52 ర‌న్స్ చేస్తే డికాక్ 39 ప‌రుగులు చేశారు. పాండ్యా అద్భుత‌మైన బౌలింగ్ తో దుమ్ము రేపాడు. 20 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అర్స్ దీప్ సింగ్ 20 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే బుబ్రా 18 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.

ఇదిలా ఉండ‌గా విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టుకు ప్రైజ్ మ‌నీ కింద రూ. 20.40 కోట్లు ద‌క్క‌గా ద‌క్షిణాఫ్రికాకు రూ. 10.67 కోట్లు ద‌క్కాయి.