యుఎస్ లో టీమిండియా ప్రాక్టీస్
ఐసీసీ టి20 వరల్డ్ కప్ పై ఫోకస్
అమెరికా – ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో 2024కు సంబంధించి టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది అమెరికా, వెస్టిండీస్. ఈసారి తొలిసారిగా యుఎస్ఏలో టోర్నీ నిర్వహించడం విశేషం. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ఐసీసీ.
అన్ని జట్లు వరల్డ్ కప్ పై కన్నేసి ఉంచాయి. ఈసారి టాప్ ఫెవరేట్ జాబితాలో భారత జట్టు కూడా ఉంది. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దేశీయ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ మేరకు జట్టులో సమతుల్యత ఉండేలా జాగ్రత్త పడింది.
ఇండియన్ క్రికెల్ సెక్షన్ కమిటీ చైర్మన్ , మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ఈసారి జట్టు ఎంపికలో మరింత జాగ్రత్త వహించాడు. ప్రత్యేకించి తీవ్రమైన విమర్శలకు దారి తీయకుండా ఉండేలా ఫోకస్ పెట్టాడు. జూన్ నెలలో ప్రారంభం కానుంది ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్.
టోర్నీలో భాగంగా రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అమెరికాకు చేరుకుంది. ఈ సందర్బంగా చేరుకున్న వెంటనే జట్టు ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.