టీ20 వరల్డ్ కప్ టీం డీక్లేర్
ప్రకటించిన బీసీసీఐ
ముంబై – వచ్చే జూన్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . మంగళవారం బీసీసీఐ ఆఫీసులో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి జే షా ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది.
ప్రధానంగా ఎవరిని వికెట్ కీపర్ గా ఎంపిక చేస్తారనే దానిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. చివరకు బీసీసీఐ తుది జాబితాను ఎంపిక చేసింది. ఈ మేరకు తుది టీ20 భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టన్ గా జూన్ 1 నుంచి ప్రారంభం అయ్యే వరల్డ్ కప్ లో పాల్గొననుంది టీమిండియా. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇక జట్టు విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు సంజూ శాంసన్. తనను ఎంపిక చేస్తారా చేయరా అన్న ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు చీఫ్ సెలక్టర్. రోహిత్ శర్మ కెప్టెన్ కాగా హార్దిక్ పాండ్యా ఉప నాయకుడిగ ఉంటాడు. వీరితో పాటు యశస్వి జైశ్వాల్ , విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ , పంత్ , సంజూ శాంసన్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, పటేల్ , కుల్దీప్ యాదవ్ , యుజ్వేంద్ర చాహల్ , అర్ష్ దీప్ సింగ్ , బుమ్రా, సిరాజ్ ఉన్నారు.
స్టాండ్ బై ఆటగాళ్లుగా శుభ్ మన్ గిల్ , రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ను ఎంపిక చేశారు.