ఆట అదుర్స్ టీమిండియాదే సీరీస్
3-1 తేడాతో దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్
జోహనెస్ బర్గ్ – సౌతాఫిక్రాకు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్లు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. తాము భారత్ లో పులులం కామని బయట కూడా తాము చిరుతలమేనంటూ నిరూపించుకున్నారు. యువ క్రికెటర్ల ఆడిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.
4 మ్యాచ్ ల టి20 సీరీస్ లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడి పోయింది. 3 మ్యాచ్ లలో గెలుపొంది సీరీస్ ను స్వంతం చేసుకుంది. తొలి టి20 మ్యాచ్ లో గెలుపొందిన టీమిండియా 2వ టీ20 మ్యాచ్ లో ఓటమి పాలైంది. 3వ, 4వ మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సెన్సేషన్ సెంచరీతో ఆకట్టుకుంటే..3వ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దుమ్ము రేపాడు.
ఇక కీలకమైన సీరీస్ ను నిర్ణయించే 4వ టి20 ఆఖరి మ్యాచ్ లో సంజూ శాంసన్ , తిలక్ వర్మ పోటీ పడి శతకాలు సాధించారు. టి20 క్రికెట్ ఫార్మాట్ లో అరుదైన రికార్డు సృష్టించాడు కేరళ స్టార్ క్రికెటర్. వికెట్ కీపర్ గా 5 మ్యాచ్ లలో 3 సెంచరీలు చేయడం. భారత క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కీపర్ ఇలాంటి ఫీట్ ను ఇప్పటి వరకు సాధించలేదు. శాంసన్ 109 రన్స్ చేస్తే తిలక్ వర్మ 120 రన్స్ చేశారు. అర్ష్ దీప్ సింగ్ అద్బుతమైన బౌలింగ్ తో సఫారీలకు చుక్కలు చూపించాడు. దీంతో ఇండిగా భారీ తేడాతో గెలుపొందింది. సీరీస్ కైవసం చేసుకుంది.