BUSINESSTECHNOLOGY

టెక్టోరో కు గూగుల్ గ్రోత్ యాక్సిల‌రేటర్ అవార్డు

Share it with your family & friends

లండన్ లో అవార్డు స్వీకరించిన ఎం డీ శ్రీధర్

హైదరాబాద్ – ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌ల విస్తరణ, సమీకృతంలో విశేషమైన సహకారం అందించినందుకు గూగుల్ నుండి హైద‌రాబాద్ కు చెందిన టెక్టోరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రతిష్టాత్మక మైన గూగుల్ గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకుంది.

లండన్‌లో జరిగిన ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ గ్లోబల్ పార్టనర్ సమ్మిట్ 2024లో ఈ అవార్డును టెక్టోరో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దన్నపనేని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ శ్రీధర్ దన్నపనేని మాట్లాడారు.

గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ గుర్తింపు అంకిత భావంతో కూడిన బృందం యొక్క కృషి, పట్టుదల, ఆండ్రాయిడ్ అడాప్షన్‌ను డ్రైవింగ్ చేయడంలో ఎడతెగని మా శ్రమకు, సాధనకు నిదర్శనం అన్నారు.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఆండ్రాయిడ్ కస్టమర్ అనుభవం, కార్యాచరణ సామర్థ్యం బలమైన భద్రతపై దృష్టి ఈ మైలురాయిని సాధించడంలో కీలకమైనవని అన్నారు. త‌మ‌ భాగస్వాముల పురోగతికి నిబద్దతతో పని చేస్తామని శ్రీధర్ చెప్పారు.

త‌మ సామర్ధ్యాన్ని మెరుగు పరుచు కునేందుకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను తాము వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ అవార్డు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.