బీఆర్ఎస్ కు షాక్ తీగల జంప్
మరికొందరు నేతలు క్యూలో
హైదరాబాద్ – అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఆదివారం మరో షాక్ తగిలింది. మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా కృష్ణా రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి రాజీనామా చేశారు. ఈనెల 27న చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. అంతే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి, బర్త బీఆర్ఎస్ కార్మిక విభాగంగా నేత శోభన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
శ్రీలతా రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, డీసీసీ చీఫ్ రోహిన్ రెడ్డి, బాబా ఫసియోద్దీన్ , యూత్ కాంగ్రెస్ చీఫ్ శివ సేన రెడ్డి పాల్గొన్నారు.