Saturday, April 5, 2025
HomeNEWSకాంగ్రెస్ ను ఖ‌తం చేస్తున్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ను ఖ‌తం చేస్తున్న రేవంత్ రెడ్డి

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌. బీజేపీకి స‌పోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖ‌తం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటు, రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కాజ్‌గిరి రెండు సీట్లల్లో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడని అన్నారు.
ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందో సీఎం ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌న్నారు.

హైద‌రాబాద్ లో బుధ‌వారం తీన్మార్ మ‌ల్ల‌న్న మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కూర్చుకున్న కుర్చీకి పునాది వేసింది తానేన‌ని అన్నారు. నువ్వు చేసిన కులగణన సర్వే తప్పు అని నేను నిరూపిస్తాన‌ని ఇందుకు నువ్వు సిద్ద‌మా అని రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరారు. మ‌నం ఒక పని చేస్తే తరతరాలు మన పేరు గుర్తుండేలా ఉండాల‌న్నారు. కానీ రేవంత్ రెడ్డి పని చేస్తే తోటి మంత్రులే ఆయన పేరు మర్చి పోతున్నారంటూ ఎద్దేవా చేశారు మ‌ల్ల‌న్న‌.

కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని, ఈడబ్ల్యూఎస్​ రక్షించుకోవడానికే కుట్ర పన్నారని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న ఆరోపించారు. కాంగ్రెస్​లో ఉంటే ప్రశ్నిస్తున్నాననే సస్పెండ్​ చేశారని అన్నారు. తనను బహిష్కరించినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments