బాబా సిద్దిక్ మర్డర్ పై తేజస్వి కామెంట్స్
లా అండ్ ఆర్డర్ పై పునరాలోచించాలి
బీహార్ – ఎన్సీపీ లీడర్, మాజీ మంత్రి బాబా సిద్దిఖీపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు ఆయనపై దాడికి పాల్పడడంతో ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఈ ఘటనపై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం , ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సీరియస్ గా స్పందించారు.
బాబా సిద్దిఖీ మర్డర్ కావడం బాధాకరమని అన్నారు. ఆదివారం తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
ఆయన హత్యకు గురైన తీరు పట్ల విచారిస్తున్నామని చెప్పారు.
ముంబై లాంటి పెద్ద నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా ఆశ్చర్యకరం అని పేర్కొన్నారు . కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీతో పాటు శివసేన పార్టీకి చెందిన ప్రభుత్వం ఉంది.
శాంతి భద్రతలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి బాబా సిద్దిఖీపై కాల్పులకు పాల్పడిన వారిలో యూపీ, హర్యానాకి చెందిన వారు ఉన్నారని గుర్తించారు. ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఇంకొకరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.