రాముడి ఆశీర్వాదం కూటమికి బలం
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కామెంట్
బీహార్ – ఆర్జేడీ చీఫ్ , మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ దేశంలో నియంతృత్వ పాలన చెల్లుబాటు కాదని ప్రజలు సరైన తీర్పు చెప్పారని అన్నారు. ఇవాళ ప్రతిపక్షాలతో కూడిన కూటమికి అద్భుతమైన రీతిలో ఆదరణ లభించిందన్నారు.
బీజేపీని, మోడీ చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మ లేదని స్పష్టం చేశారు. బుధవారం పాట్నాలో తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందో తమకు కూడా అంతే ఛాన్స్ ఉందన్నారు.
విచిత్రం ఏమిటంటే ఇవాళ ఢిల్లీకి ఇద్దరు ప్రత్యర్థులు ఒకే విమానంలో ప్రయాణం చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో తేజస్వి యాదవ్ అన్నీ తానై వ్యవహరించారు. ఒక రకంగా కూటమికి జీవం పోశారని చెప్పక తప్పదు.
ప్రజలు తమను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశీర్వదించారని, భారీ ఎత్తున సీట్లను కట్టబెట్టారని ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. తాము చివరి దాకా ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు తేజస్వి యాదవ్.