NEWSNATIONAL

బీజేపీకి అంత సీన్ లేదు

Share it with your family & friends

తేజ‌స్వి యాద‌వ్ కామెంట్

బీహార్ – అంద‌రి క‌ళ్లు తేజ‌స్వి యాద‌వ్ పై ఉన్నాయి. ఆయ‌న మొన్న‌టి దాకా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌భుత్వం నుంచి వైదొలిగారు. తన‌తో జ‌త క‌ట్టిన నితీశ్ కుమార్ ఉన్న‌ట్టుండి మ‌ళ్లీ జంప్ అయ్యారు. ఆయ‌న మోదీ పంచ‌న చేరారు.

కానీ ఇచ్చిన మాట కోసం క‌ట్టుబ‌డి ఉన్నారు తేజ‌స్వి యాద‌వ్. ఆయ‌న కొలువుతీరిన స‌మ‌యంలో చాలా వ‌ర‌కు జాబ్స్ ను క్రియేట్ చేశారు. వేలాది మందికి అపాయింట్మెంట్ లెట‌ర్లు ఇచ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. దీంతో బీహార్ లో ఇప్పుడు ఇండియా కూట‌మి హ‌వా కొన‌సాగుతోంది.

నితీశ్ కుమార్ చ‌రిష్మా ఏ మాత్రం ప‌ని చేయడం లేద‌ని స‌మాచారం. ఇక దేశంలో యువ నాయ‌కుల హ‌వా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం బీహార్ నుంచి తేజ‌స్వి యాద‌వ్ , యూపీలో రాహుల్ , అఖిలేష్ యాద‌వ్ , ప్రియాంక గాంధీ ..ఢిల్లీలో క‌న్హ‌య్య కుమార్ లాంటి వాళ్లు త‌మదైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. మొత్తంగా తేజ‌స్వి యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి 400 సీట్లు కాదు క‌దా 200 సీట్లు కూడా రావ‌న్నారు.