తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్
బీహార్ – మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు , ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీకే ఈమధ్యన ప్రతిపక్షాలతో కూడిన కూటమి గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయన తనను తాను నమ్మడం లేదని ఇక ఇతరుల గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు తేజస్వి యాదవ్.
ప్రశాంత్ కిషోర్ గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీకి ఏజెంట్ గా పని చేస్తున్నాడని అన్నారు తేజస్వి యాదవ్. ఇది దేశంలోని 143 కోట్ల మంది భారతీయులకు తెలుసన్నారు. పీకే బీజేపీ అగ్ర నాయకుల ఆదేశాల మేరకే పని చేస్తూ వస్తున్నాడని స్పష్టం చేశారు.
ప్రశాంత్ కిషోర్ ఒక స్వచ్చంధ సంస్థను ప్రారంభించాడని, ఇది ఇప్పుడు బీహార్ లో బీజేపీ సాధనంగా పని చేస్తందని ఆరోపించారు తేజస్వి యాదవ్. ఇదిలా ఉండగా బీజేపీకి సాయం చేయాలనే ఉద్దేశం నితీశ్ కుమార్ కు కూడా తెలుసని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం.