నెట్టింట్లో హల్ చల్
బీహార్ – ఆర్జేడీ చీఫ్ , మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వైరల్ గా మారారు. ఎవరు ఇండియా కూటమి నుంచి వెళ్లి పోయినా లేదా హ్యాండ్ ఇచ్చినా తాము మాత్రం రాహుల్ గాంధీతో కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్బంగా చెమటోడ్చి శ్రమిస్తున్న ఏఐససీ మాజీ చీఫ్ తో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం తాను వాహనం నడుపుతుండగా పక్క సీట్లో రాహుల్ గాంధీ కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇద్దరూ యువ నాయకులు కావడం గమనార్హం. తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు. ఆయనే ప్రస్తుతం పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్నారు. ఇటీవలే బీహార్ రాష్ట్రంలో సీఎం నితీశ్ కుమార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఉన్నట్టుండి నితీశ్ మోసం చేశారు. తిరిగి భారతీయ జనతా పార్టీతో జంప్ అయ్యారు. ముచ్చటగా ఏడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనినే ప్రత్యేకంగా ప్రస్తావించారు తేజస్వి యాదవ్ శాసన సభలో.
రాజకీయాలలో కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలని, కానీ పదవుల కోసం పార్టీని తాకట్టు పెట్టడం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు తేజస్వి యాదవ్.