ఆ భూమి అంతా ప్రభుత్వానిదేనని ప్రకటన
హైదరాబాద్ – ఆ 400 ఎకరాల భూమి ముమ్మాటికీ తెలంగాణ సర్కార్ కు చెందినదేనంటూ స్పష్టం చేసింది ప్రభుత్వం. సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి ఆ భూమి హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయానికి చెందినది కాదంటూ పేర్కొంది. ఆ ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తెలిపింది. ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుందని తెలిపింది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల కిత్రం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని స్పష్టం చేసింది.
వేలం. అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బ తీయమని, అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్) లేదని తెలిపింది సర్కార్. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనంటూ పేర్కొంది. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఈ భూమిని కేటాయించిందని తెలిపింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలవడం ద్వారా ఆ భూమిపై యాజమాన్యాన్ని దక్కించుకుందని వెల్లడించింది.
ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ)ది కాదని తేలిందని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి… పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేసింది.