ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు
రూ. 1.78 లక్షలు స్వాధీనం
హైదరాబాద్ – అవినీతి నిరోధక శాఖ జూలు విదిల్చింది. తీవ్రమైన ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగింది. ఈ మేరకు పలు జిల్లాల్లో ఆకస్మిక దాడులు చేపట్టింది.
తెలంగాణలోని ఆదిలాబాద్, నల్లొండ, గద్వాల్ జిల్లాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఆర్టీఏ చెక్ పోస్టులపై దాడులు చేపట్టింది. ఆదిలాబాద్ లోని భోజరాజు చెక్ పోస్ట్ , నల్గొండలోని విష్ణుపురం, గద్వాల్ లోని ఆలంపూర్ చెక్ పోస్టులను తనిఖీ చేసింది.
అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ. 1.78 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా యధేశ్చగా కళ్లుగప్పి వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందాయి. దీంతో చెప్పా పెట్టకుండా దాడులు చేపట్టారు.
ఏసీబీ రాకతో ఆయా చెక్ పోస్టుల వద్ద గట్టి బందోబస్తు మధ్య తనిఖీలు నిర్వహించారు. దీంతో ఇతర చెక్ పోస్టులకు ఈ సమాచారం తెలియడంతో అంతా అలర్ట్ అయ్యారు.