NEWSTELANGANA

సీఎంల సమావేశానికి ఎజెండా ఖరారు

Share it with your family & friends

భేటీ కానున్న గురు శిష్యులు బాబు..రేవంత్

హైద‌రాబాద్ – తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్ర‌దేశ్ , తెలంగాణ ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు శ‌నివారం భేటీ కానున్నారు. ఇద్ద‌రూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావ‌డం విశేషం. చంద్రబాబు పార్టీకి చీఫ్ గా ఉన్నారు. ఈ స‌మ‌యంలో ఇండిపెండెట్ జెడ్పీటీసీగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు.

అనూహ్యంగా టీడీపీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. పార్టీని విజ‌య ప‌థంలో న‌డిపించారు. చివ‌ర‌కు గురువును మించిన శిష్యుడు అని పించుకున్నారు రేవంత్ రెడ్డి. ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు. బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరు పొందిన కేసీఆర్ కు చుక్క‌లు చూపించాడు.

ఇదే స‌మ‌యంలో నారా చంద్ర‌బాబు నాయుడును త‌న గురువుగా ప్ర‌క‌టించారు గ‌తంలో రేవంత్ రెడ్డి. తాజాగా ఇద్ద‌రు సీఎంల హోదాల‌లో భేటీ కానున్నారు. షెడ్యూల్ 9 లోని ఆస్తుల విభజన – షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజన – చట్టంలో పేర్కొనబడని ఆస్తుల విభజన – ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ అంశం – విద్యుత్ బకాయిల అంశం – 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పుల పంపిణీ గురించి ప్ర‌స్తావ‌న‌కు రానున్నాయి.

ఉద్యోగుల మార్పిడి, లేబర్‌సెస్ పంపిణీ – ఉమ్మడి సంస్థల ఖర్చు సొమ్మును తిరిగి చెల్లించడం – హైదరాబాద్‌లో 3 భవనాల పంపకాలు నిలుపుదల అంశం – మొత్తం 91 సంస్థలలో 89 సంస్థల కేంద్ర సముదాయాల పంపిణీకి షీలా బేడీ కమిటీ సిఫారస్సులు – ఈసీ సిఫారస్సులలో 68 సంస్థల విషయంలో తెలంగాణ అంగీకారం పై చ‌ర్చించ‌నున్నారు.