Tuesday, April 22, 2025
HomeNEWSగ్లోబ‌ల్ టూరిజం ప్లేస్ గా తెలంగాణ

గ్లోబ‌ల్ టూరిజం ప్లేస్ గా తెలంగాణ

మంత్రి జూప‌ల్లి కృష్ణా రావు ప్ర‌క‌ట‌న

హైదరాబాద్ – టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి స్టేట్‌మెంట్ ఇచ్చారు. పర్యాటక రంగంలో తెలంగాణ 9వ స్థానంలో ఉందన్నారు.. పర్యాటకం అనేది ఒకప్పుడు విలాసమ‌ని కానీ ఇప్పుడు నిత్యావసరంగా మారి పోయింద‌న్నారు. వచ్చే నాలుగేళ్లలో గ్లోబల్‌ టూరిజం ప్లేస్‌గా తెలంగాణను మారుస్తామ‌న్నారు. అమరవీరుల ఆకాంక్షలు ఇప్పుడిప్పుడే నెరవేరుతున్నాయని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింద‌న్నారు.. తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లుకు ఆమోదం ల‌భించింద‌న్నారు జూప‌ల్లి కృష్ణారావు.. జీఎస్టీ సవరణ బిల్లును సభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్ర‌వేశ పెట్టార‌ని తెలిపారు.

కాఆ బీఆర్ఎస్‌, బీజేపీ సభ్యుల నిరసనల మధ్య బిల్లులను ఆమోదించింది. అనంత‌రం టూరిజం పాలసీపై చర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా జూప‌ల్లి కృష్ణారావు స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. త‌మ ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగానికి పెద్ద‌పీట వేస్తోంద‌ని చెప్పారు.

అందుకు ప్రజల జీవనశైలే ప్రత్యేక ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ పర్యాటక పూర్వ వైభవాన్ని, వారసత్వాన్ని పునరుజ్జీవింప జేసేందుకు కృషి చేస్తామ‌న్నారు జూప‌ల్లి కృష్ణా రావు. కొంద‌రు కావాల‌ని ప‌నిగ‌ట్టుకుని బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు మంత్రి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments