ప్రకటించిన రాష్ట్ర చీఫ్ జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్ – బీజేపీ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలకు పార్టీ పరంగా అధ్యక్షులను ప్రకటించారు పార్టీ చీఫ్ , కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి. రంగారెడ్డి అర్బన్ జిల్లాకు శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి రూరల్ కు రాజ్ భూపాల్ గౌడ్, వికారాబాద్ జిల్లాకు రాజశేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ కు నరేందర్ రావు, గద్వాల జిల్లాకు రామాంజనేయులు, ఖమ్మం జిల్లాకు కోటేశ్వర రావు, భద్రాద్రి జిల్లాకు నిరంజన్ యాదవ్ లను నియమించారు. కాగా మేడ్చల్ అర్బన్ , కరీంనగర్ జిల్లాల అధ్యక్షుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు. 38 జిల్లాలకు గాను 36 జిల్లాలకు చీఫ్ లను నియమించారు.
ఇదిలా ఉండగా గతంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ, లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టింది. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీతో పాటు 2వ స్థానంలో నిలిచింది. ఇంకొన్ని సీట్లను తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయింది. ప్రజల ఆదరణను మరింత అవకాశంగా మల్చు కోవాలని, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు పార్టీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి. త్వరలోనే మిగిలిన 2 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.