అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఫోకస్
త్వరలో లోక్ సభ ఎన్నికలు
హైదరాబాద్ – రాష్ట్రంలో త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 17 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే బీజేపీకి సంబంధించి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఈసారి బీజేపీకి రాష్ట్రంలో గణనీయమైన ఓటు బ్యాంకు లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల సీట్లు దక్కించు కోవడం ఒకింత బలాన్ని ఇచ్చేలా చేసింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం పార్టీ హైకమాండ్ మొత్తం సీట్లను క్లీన్ స్వీప్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు దిశా నిర్దేశం చేసింది. ఇదిలా ఉండగా ఆయా ఎంపీ సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది బీజేపీ. ఈ మేరకు పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి సారథ్యంలో అభ్యర్థుల ఎంపిక కమిటీ కసరత్తు చేస్తోంది.
మరో వైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభిప్రాయాలను సేకరిస్తోంది. ఆశావహుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఎంపిక అనేది తలకు మించిన భారంగా మారింది. మొత్తంగా హై కమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది.
మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి భారీ పోటీ ఉందని సమాచారం. ఇక్కడ శాంతి కుమార్ , డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. చాలా చోట్ల ఒక్క సీటుకు నలుగురు లేదా ఐదుగురు పోటీ పడుతుండడం విశేషం.