NEWSTELANGANA

తెలంగాణ చూపు బీజేపీ వైపు – మోడీ

Share it with your family & friends

పీఎంను క‌లిసిన ఎంపీలు..ఎమ్మెల్యేలు

ఢిల్లీ – తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపు చూస్తున్నార‌ని, దానిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలో బుధ‌వారం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు మ‌ర్యాద పూర్వ‌కంగా పీఎంతో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్బంగా మోడీని ప్ర‌త్యేకంగా అభినందించారు. వారిని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు పీఎం. ఇక నుంచి తెలంగాణ‌లో క‌మ‌లం అధికారంలోకి వ‌చ్చేలా చూడాల‌ని సూచించారు. ప్ర‌జ‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్ల‌, గ‌తంలో బీఆర్ఎస్ పార్టీ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌ని దీనిని గుర్తించాల‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునేలా మ‌నం ప‌ని చేయాల‌ని, అప్పుడే మ‌న‌కు విజ‌యం ద‌క్కుతుంద‌న్నారు మోడీ. ఇదే స‌మ‌యంలో తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి.

ఈ స‌మావేశంలో కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్, ఎంపీలు డీకే అరుణ‌, ఈట‌ల రాజేంద‌ర్, ధ‌ర్మ‌పురి అర‌వింద్, విశ్వేశ్వ‌ర్ రెడ్డి, కాట్రేప‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి, త‌దిత‌రులు ఉన్నారు.